రేవంత్... దేవుళ్లపై కాదు భార్యాపిల్లలపై ఒట్టేసి చెప్పు: కేటీఆర్

60చూసినవారు
రేవంత్... దేవుళ్లపై కాదు భార్యాపిల్లలపై ఒట్టేసి చెప్పు: కేటీఆర్
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి తన భార్యాపిల్లలపై ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. వచ్చే ఆగస్టులోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ దేవుళ్లపై ఒట్టు పెట్టడం కాదని, దమ్మూధైర్యం ఉంటే భార్యాపిల్లలపై ఒట్టు వేసి చెప్పాలని ఛాలెంజ్ చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 150 రోజులవుతున్నా అది జరగలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్