తెలంగాణలో టీచర్ల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని వెల్లడించింది. 1-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకటి, 11-40 వరకు విద్యార్థులున్న పాఠశాలకు రెండు, 41-60 మంది విద్యార్థులున్న పాఠశాలకు మూడు, 61పైన విద్యార్థులున్న స్కూలుకు ఆ పాఠశాలకు మంజూరైన అన్ని పోస్టులు భర్తీ చేసేలా వెబ్ ఆప్షన్ల కేటాయింపులు చేస్తారని తెలుస్తోంది.