అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంప్రదాయ ఈ-కామర్స్ దిగ్గజాలకు క్విక్ కామర్స్ పోటీనిస్తుందని జెప్టో CEO ఆదిత్ పాలీచా అన్నారు. భారత్‌లో అమెజాన్/ఫ్లిప్‌కార్ట్ స్థాయి ఫలితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని క్విక్ కామర్స్ కలిగి ఉందని 2024లో ప్రజలు గ్రహిస్తారని జెప్టో గతేడాది ప్రకటించిందని లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్టులో ఆయన గుర్తు చేశారు. 2025లో క్విక్ కామర్స్ కూడా ఈ-కామర్స్‌తో పోల్చదగిన స్థాయిని చేరుకుంటుందన్నారు.