రిషబ్ పంత్ ప్రస్టేషన్.. వీడియో వైరల్

2953చూసినవారు
రాజస్థాన్ రాయల్స్ చేతిలో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకమైన దశలో ఔట్ అయిన డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 26 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 28 పరుగులే చేశాడు. దీంతో పెవిలియన్‌కు వెళ్తూ అనవసరంగా వికెట్‌ పారేసుకున్నానన్న కోపంలో తన బ్యాట్‌ను కర్టెయిన్‌కేసి గట్టిగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

సంబంధిత పోస్ట్