ఏపీలో 2023-24కు గాను రూ.23,589 కోట్లు మూలధన వ్యయం చేసినట్లు కాగ్ ప్రైమరీ అకౌంట్స్‌లో వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ ఖర్చు రూ.87,972 కోట్లని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల వేతనాలకు రూ.52,010 కోట్లు, పెన్షన్లకు రూ.21,694 కోట్లు, సామాజిక రంగానికి రూ.1,10,375 కోట్లు, సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.