AP: మంచు వారి ఫ్యామిలీలో మళ్లీ రగడ రాజుకుంది. తనపై, తన భార్యపై దాడి జరిగిందని తిరుపతి(D) చంద్రగిరి పీఎస్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు వర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించగా, శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. నిన్న MBUలోకి ఆయనను వెళ్లనివ్వకపోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది.