AP: పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రైతు అవతారం ఎత్తారు. సామాన్య రైతులా మారి పొలం పనులు చేస్తూ కనిపించారు. కనుమ పండగ రోజు కొంత తీరిక సమయం దొరికడంతో.. ఉదయాన్నే సొంతూరు ఆగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లారు. అక్కడ వరి పొలానికి మందు పిచికారీ చేశారు. ఈ మేరకు తనకు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం అని మంత్రి చెప్పారు. పండుగ సమయంలో తమ సొంత పొలంలో పని చేయడం చాలా తృప్తినిచ్చిందని ఆయన తెలిపారు.