వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక బయల్దేరారు. ముంబై ఎయిర్ పోర్టులో ఆయన వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా కొద్ది రోజుల క్రితం హిట్ మ్యాన్ తన ఫ్యామిలీతో కలిసి యూఎస్ వెకేషన్ కు వెళ్లారు. ఇటీవల తిరిగి స్వదేశానికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.