ప్రియుడితో భార్య రాసలీలలు

258907చూసినవారు
ప్రియుడితో భార్య రాసలీలలు
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు తంగెళ్లమూడికి చెందిన కుసుమ నాగసాయి(30)కి 2014లో నిడదవోలు మండలం తాళ్లపాలేనికి చెందిన వ్యక్తితో పెళ్లి అయ్యింది. అయితే అంతకుముందే ఆమె ఏలూరు గన్‌బజార్‌కు చెందిన షేక్‌ నాగూర్‌ (28)ని ప్రేమించింది. పెళ్లయిన తర్వాత కూడా వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. నాగూర్‌ మధ్యమధ్యలో నిడదవోలు వచ్చి ఆమెను కలిసి వెళ్లేవాడని స్థానికులు చెప్తున్నారు.

ఆదివారం కూడా అలాగే తాళ్లపాలెం రాగా.. వీరికి నాగసాయి బంధువు ఒకరు గది ఇచ్చారు. వీరిద్దరూ గదిలో ఉన్న విషయం భర్తకు తెలియడంతో స్థానికులను తీసుకుని ఆ ఇంటి వద్దకొచ్చి వారిని బంధించారు. వారిద్దరినీ కొట్టి.. శెట్టిపేటలోని తమ బంధువుల ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు ఆనుకుని ఉన్న గదిలో బంధించారు. అక్కడే వాళ్లిద్దరూ గదిలో ఉన్న ఎలుకల మందు మింగారు. కొద్దిసేపటికి గదిలో చూడగా కుసుమ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మరి కొద్దిసేపటికి నాగూర్‌ కూడా ఆ గదిలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. భయంతో వారే ఎలుకల మందు తిన్నారా.. లేదా వేరే ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్