మహిళ స్కూటీపై రూ.1.36లక్షల ఫైన్

65చూసినవారు
మహిళ స్కూటీపై రూ.1.36లక్షల ఫైన్
బెంగళూరులో ఓ మహిళకు ఏకంగా రూ.1.36లక్షల ఫైన్ పడింది. సదరు మహిళ పదేపదే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు. హెల్మెట్ ధరించకపోవడంతో పాటు ట్రిపుల్ రైడింగ్ వంటివి చేస్తూ 277 సార్లు నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఆమె హోండా యాక్టివాపై భారీ జరిమానా పడింది. ఆ స్కూటీ ఖరీదు కంటే ఫైన్ అమౌంట్ ఎక్కువ కావడం గమనార్హం.