TG: రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదన్న విమర్శలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఏ జిల్లాలో ఎంత రుణమాఫీ జరిగిందో శాసనసభ ఆవరణలో లిస్టు పెడతామనన్నారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. రూ.263 లక్షల కోట్లు రుణమాఫీ చేశాం. మేము పనులు చేశాం. మీరు ప్రచారాలు చేసుకుంటూ బతికారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రుణమాఫీ చేశాం. సిద్దిపేటలో బీఆర్ఎస్ కంటే ఎక్కువగా మేము రూ.177 కోట్లు రుణమాఫీ చేశాం' అన్నారు.