బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. జనవరి 16న దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే సైఫ్ కోలుకోవడంతో వైద్యులు కాసేపటి క్రితం డిశ్ఛార్జి చేశారు. భద్రతా మధ్య కుటుంబసభ్యులతో కలిసి సైఫ్ అలీఖాన్ ఇంటికి బయలుదేరారు.