బీసీసీఐ కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా నియమితులయ్యారు. బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులు వాళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎందుకంటే వారు మాత్రమే సంబంధిత పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో జై షా బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి పదవికి వైదొలిగారు.