రాయికోడ్: మహిళ అదృశ్యం

58చూసినవారు
రాయికోడ్: మహిళ అదృశ్యం
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని నల్లంపల్లి గ్రామంలో మహిళ అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ నారాయణ తెలిపిన కథనం ప్రకారం, గ్రామానికి చెందిన మొటికే అడివమ్మ (75) గత నెల 31న కాలకృత్యాలు తీర్చుకుంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఇంటి పక్కన, బంధువులు, బావుల దగ్గర వెతికిన కనిపించకపోవడంతో శుక్రవారం ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.