జిన్నారం: శ్రీ వాగ్దేవి సరస్వతీ మాతగా జంగంపేట ఎల్లమ్మ తల్లి
జిన్నారం మండలం జంగంపేట గ్రామపంచాయతీ పరిధిలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం రేణుక ఎల్లమ్మ తల్లి శ్రీ వాగ్దేవి శ్రీ సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెలుపు రంగు వస్త్రాలు ధరించి దద్దోజనం, పరమాన్నం, రవ్వ కేసరి నైవేద్యాలుగా సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.