ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్

78చూసినవారు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్
AP: సోమవారం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ అనకాపల్లి, విశాఖ, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణ, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళ, బుధ, గురు వారాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్