సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎంపీపీ కార్యాలయంలో శనివారం 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ సుమతీ, ఎంపీఓ రాజ్ కుమార్ లతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యుడు గోకర్ శ్రీధర్ గౌడ్, కార్యాలయ సిబ్బంది రాములు, నాయకులు పుట్టి భాస్కర్, స్వామి, పల్నాటి భాస్కర్ గ్రామస్తులు పాల్గొన్నారు.