జిన్నారం నుంచి గగిలాపూర్ కు బస్సు సౌకర్యం

58చూసినవారు
జిన్నారం నుంచి గగిలాపూర్ కు బస్సు సౌకర్యం
జిన్నారం మండల కేంద్రం నుంచి గగిలాపూర్ వరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని న్యూ ల్యాండ్ పరిశ్రమ యాజమాన్యం బుధవారం ఏర్పాటు చేసింది. మండల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమ యజమాన్యం కోరారు. జిన్నారం నుంచి బస్సు బయలుదేరు వేళలు ఉదయం 8, మధ్యాహ్నం 1: 10, సాయంత్రం 6: 25 గంటలకు, గగిలాపూర్ నుండి బయలుదేరు వేళలు ఉదయం 9: 20, సాయంత్రం 4: 10, రాత్రి 7: 30 గంటలకుగా యాజమాన్యం పేర్కొంది.

సంబంధిత పోస్ట్