Sep 19, 2024, 09:09 IST/
ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వారికి బ్యాడ్ న్యూస్
Sep 19, 2024, 09:09 IST
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాకిచ్చింది. ఇన్‌స్టాలో బ్యూటీ ఫిల్టర్లను తొలగించనుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి నుంచి తమ యాప్స్‌లో ఈ బ్యూటీ ఫిల్టర్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది. దీంతో వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో యూజర్లు రూపొందించిన సుమారు 20 లక్షలకు పైగా ఫిల్టర్లు మాయం కానున్నాయి. ఈ బ్యూటీ ఫిల్టర్లు యువతుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని నిర్ధారణకు వచ్చిన మెటా వీటిని తీసేయనుంది.