కారు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి (వీడియో)

72చూసినవారు
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బనగానపల్లెలో పింజరి పేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహమ్మద్ అలీ, రెహనా దంపుతుల కుమారుడు అబుబకర్ సిద్ధిక్ (3) రోడ్డుపై ఆడుకుంటున్న సమయంలో ఓ కారు ఢీకొట్టింది. బాలుడి తలపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంల కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్