మంచినీటి సమస్య పరిష్కరించాలని నిరసన
కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ 50 సంవత్సరాల నుంచి మంచినీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో బోరుబావులను వాడుకోవాల్సి వస్తుందని చెప్పారు. అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.