కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామంలో సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో బలవంత భూసేకరణ వెంటనే ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం త్రిపులార్ భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వస్తే గ్రామ రైతులతో కలిసి ఆడ్డుకోవడం జరిగింది. నష్టపరిహారం ఎంత ఇస్తారు అని అధికారులు చెప్పకుండా ఏ విధంగా సర్వేలు చేస్తారని రైతులతో కలిసి ధర్నా చేయడం నిర్వహించారు.