నాగల్ గిద్ద: మహా రుద్రాభిషేకం పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
నాగల్ గిద్ద మండలం శేరిదామరగిద్దా గ్రామానికి చెందిన తమ్ముళూర్ శ్రీ శ్రీ సద్గురు శివానంద చారి అప్పగారి ఆధ్వర్యంలో శనివారం మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.