బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని మనూర్ తహసీల్దార్ వెంకట్ స్వామి, ఐసిడిఎస్ సూపర్వైజర్ జమున అన్నారు. మనూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవం ముగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల అవగాహన గ్రామస్థాయిలో అంగన్వాడీ సెంటర్లలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు.