దీపావళి సందర్భంగా నారాయణఖేడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో పేకాట ఆడుతూ వేర్వేరు స్థావరాల్లో పట్టుబడిన 49 మంది పై కేసు నమోదు చేసినట్లు ఖేడ్ ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు వేర్వేరుగా 5 కేసులు నమోదు చేసి, వారి నుంచి మొత్తం రూ. 94, 920 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. మండల పరిధిలో ఎవరైనా పేకాట ఆడితే సమాచారం అందించాలని కోరారు.