సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ పట్టణం ప్రాంతీయ ప్రజలకు కార్తీకమాసం సందర్భంగా నారాయణఖేడ్ నుండి అరుణాచలం గిరి వరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మల్లేశం తెలిపారు. బుదవారం బయలుదేరిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. డిసెంబర్ లో కూడా పౌర్ణమి సందర్భంగా ప్రదక్షిణకు వెళ్లే ప్రయాణికులకు సూపర్ లగ్జరీ బస్సులు అరెంజ్ చేస్తామని తెలిపారు.