మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యాదవ్ రెడ్డి, సంగన్న మాట్లాడుతూ. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన భూపాల్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగినట్లు పేర్కొన్నారు.