కార్తీకమాసం దీపోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నారాయణఖేడ్ మండలం పరిధిలో బోరంచలో భోగేశ్వరస్వామికి రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించనున్నట్లు భోగేశ్వరా నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సద్గురు సోమలింగ శివాచార్య ఆధ్వర్యంలో పార్థవలింగ రుద్రాభిషేకం శివపార్వతుల కల్యాణోత్సవం, కార్తీక దీపారాధన, గురువు అమృత ఉపదేశం, మహా మంగళహారతి , అన్నప్రసాద వితరణ భజన కీర్తనలు కార్యక్రమాలను ఉంటాయన్నారు.