విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ సూచించారు. నారాయణఖేడ్ ఇంటిగ్రేటెడ్ బీసీ వసతి గృహాన్ని బుధవారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. అనంతరం వసతి గృహంలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.