మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, క్షేమంగా ఇల్లు చేరాలంటే వాహనాలు నడిపేవారు మద్యం సేవించిరాదని నారాయణఖేడ్ ఎస్సై శ్రీశైలం అన్నారు. బుధవారం రాత్రి నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌక్ లో ఆయన సిబ్బందితో కలిసి వాహనాలను తనీఖి చేశారు. కఠిన సెక్షన్లు ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నంబర్ లు లేని వాహనాలు పట్టుకుంటే సీజ్ చేయబడుతాయని తెలిపారు.