నారాయణఖేడ్ మండల పరిధిలోని జూకల్ శివారులో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో సోమవారం 6వ, 10వ జోనల్ మీట్ అండర్ 14,17,19 బాయ్స్ పోటీలను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుండి ఒలంపిక్స్ వంటి పోటీలకు క్రీడాకారులు ఎంపిక కావాలంటే క్రీడ పోటీలను విజయవంతంగా నిర్వహించాలని అధ్యాపకులకు, కోచ్ లకు, ఎమ్మెల్యే తెలిపారు.