మహిపాల్ రెడ్డి పార్టీని వీడిన నష్టం లేదు: హరీష్ రావు
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ వీడిన పార్టీకి నష్టం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్ చెరులో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మహిపాల్ రెడ్డిని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీకి ద్రోహం చేసేందుకు మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నాయకులు వెళ్లిన కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉండాలని చెప్పారు.