హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. అమీన్ పూర్ లో సోమవారం బిజెపి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరితో పార్టీ సభ్యత్వాన్ని చేయించాలని చెప్పారు. కార్యక్రమంలో సభ్యత్వ సేకరణ ఇన్చార్జి లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు.