రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూ సేకరణ సర్వే మొదలైంది. హత్నూర మండలం దేవులపల్లి, కాసాల గ్రామ శివారులో శుక్రవారం రెవెన్యూ అధికారులు భూ సేకరణ సర్వే నిర్వహించారు. చుట్టూ పక్కల ప్రధాన పట్టణాలను కలుపుతూ ఆర్ఆర్ఆర్ రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచి ఆర్ ఆర్ ఆర్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధపడింది.