పారిశ్రామికవాడలోని పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జిన్నారం మండలం బొల్లారం పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సిపియం జిల్లా కార్యదర్శి రాజయ్య, జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సతీష్ కుమార్, సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కౌన్సిలర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.