Top 10 viral news 🔥
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఈడీ వర్క్స్ భవనాన్ని కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడించారు. కుటుంబాలతో కలిసి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. దాంతో అక్కడికి పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు భారీగా మోహరించారు.