సంగారెడ్డి: భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభను జయప్రదం చేయాలి

61చూసినవారు
సంగారెడ్డి: భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభను జయప్రదం చేయాలి
భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభ నవంబర్ 24వ తేదీన సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. మహాసభ కరపత్రాలను ఆదివారం రామచంద్రాపురంలోని సంఘ భవనంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మహాసభలో చర్చిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సాయిలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్