సదాశివపేట: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
సదాశివపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న కారు యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు.