మండలంలోని నస్తీపూర్ గ్రామానికి చెందిన వరిగుంతం కృష్ణ నేషనల్ అవార్డును అందుకున్నారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కొరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారికి బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి యేటా అందిస్తున్న అంబేద్కర్ నేషనల్ 2022 అవార్డును సోమవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బిఎస్ఎ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకోవడంపై కృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డు రాకతో తనపై మరింత బాధ్యత పెరిగిందని వారు తెలిపారు.