మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి బుధవారం కలెక్టర్ వల్లూరు క్రాంతి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ మహాత్ముని ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు