ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అధ్యాపకులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ సిద్ధులు పాల్గొన్నారు.