మండల కేంద్రమైన హత్నూర సర్పంచ్ వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో హరిహర సుతుడు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ పూజ గురు స్వామి ఆంజనేయులు గౌడ్ నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో అభిషేకాలు కుంకుమ పసుపు, 18 మెట్ల పూజలు ఘనంగా జరిగాయి. పడిపూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు భక్తి ఆటపాటలతో కనుల పండుగగా పూజా కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.