శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం నిర్వహణలో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి సంగారెడ్డికి కోటి రుద్రాక్షలను తెప్పిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే కోటి రుద్రాక్షలను సంగారెడ్డికి పంపించినట్లు పేర్కొన్నారు.