జిల్లాలో ధ్వంసమైన బీటీ రోడ్లకు మరమ్మత్తులు చేయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి అధికారులకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీటీ రోడ్లు ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు, యాదవ రెడ్డి పాల్గొన్నారు.