స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేర్చాలని కోరుతూ న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం నిరాహార దీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వల్లూరు క్రాంతి కి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ఫ్రీడమ్ ఫైటర్లు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిరాహార దీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 10, 11 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష నిర్వహిస్తానన్నారు.