సంగారెడ్డి జిల్లా కంది మండలం ఏర్ధనూరు గ్రామం లోని ఓ కాలనీ లో కొన్ని నెలలు గా గ్రామ పంచాయతీ బోర్ లీక్ అవడం వలన నీరు రోడ్లపై పారి ఇలా మొత్తం బురదమయంగా మారుతుంది అని గ్రామస్థులు తెలిపారు. బురద రోడ్లో నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు చెప్పిన లాభం ఏమిలేదు అని గ్రామస్థులు తెలిపారు. రోజు రోజుకి పెరిగిపోతున్న గుంతలు చూసి గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని సమస్య తీర్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.