సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం లోని ఆత్మకూర్ గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయం చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 వ తేదీ శుక్రవారం నుండి 11 వ తేదీ శనివారం వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా మొదటి రోజు ఉదయం 8: 10 నిలకు గురు వందనం, గణపతి పూజ, పుణ్యావాచన, ఋత్విక్ వరుణం, ద్వజారోహణం, దేవతా ఆహ్వానము, అభిషేకము, గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం, పూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ ఉంటుంది అని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.