May 19, 2024, 09:05 IST/అందోల్ నియోజకవర్గం
అందోల్ నియోజకవర్గం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
May 19, 2024, 09:05 IST
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డి పల్లిలోని ఓ ఫంక్షన్ హల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. చౌటకూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ 1986-1987 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులందరూ సమావేశమై తమ అనుభవాలను పంచుకున్నారు. అదే విధంగా చదువు, సంస్కారాలను నేర్పిన అధ్యాపకులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.