సాధారణంగా జూన్, జూలై మాసాల్లో వర్షాలు పడుతుంటాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే తొలకరి చినుకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో తుగ్గిలి, వజ్రకరూరు పొలాల్లో స్థానికులతో పాటు సమీపంలోని కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వెతుకులాట ప్రారంభించారు. గతంలో చాలా మందికి దొరికిన వజ్రాలు అధిక ధరకు అమ్ముడుపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉద్యోగులు సైతం వెతుకుతున్నారు.