జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో ఉరడమ్మ, పోచమ్మ. అమ్మవారి బోనాల వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను ధరించి గ్రామపుర వీధుల మీదగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఉరడమ్మ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.